|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 11:09 AM
అక్టోబర్ 1వ తేదీ నుండి రేషన్ షాపులు బంద్. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని పౌర సరఫరా శాఖకు సమ్మె నోటీసులు ఇచ్చిన రేషన్ డీలర్లు . వచ్చే నెల 1వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేయనున్నట్టు ప్రకటించిన రేషన్ డీలర్ల సంఘాలు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ నిధులు విడుదల చేయడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రేషన్ డీలర్ల సమ్మె బాట. వెంటనే నిధులు విడుదల చేయకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తూ పౌర సరఫరా శాఖకు సమ్మె నోటీసులు ఇచ్చిన రేషన్ డీలర్లు