|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 06:25 PM
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్కు రాజీనామా లేఖను పంపించారు.బీజేపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 9న గువ్వల బీజేపీ గూటికి చేరే ఛాన్స్ ఉందన్న చర్చ సాగుతోంది. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి బీఆర్ఎస్ లో కొనసాగారు గువ్వల. దీంతో గత మూడు ఎన్నికల్లో ఆయనను అచ్చంపేట అభ్యర్థిగా బరిలోకి దించింది గులాబీ పార్టీ.2014, 2018లో ఆయన వరుస విజయాలు సాధించారు. కానీ, గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి నాటి నుంచి కూడా ఆయన బీఆర్ఎస్ లో యాక్టీవ్ గా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా గువ్వల ఉన్నారు.వారం క్రితం హరీష్ రావు నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలోనూ పాల్గొన్నారు. ఇంతలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఆయన రాజీనామాకు కారణం ఏంటనే అంశం ఇంకా బయటకు రాలేదు