|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 06:12 PM
జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోమవారం ఉదయం నుండి తనిఖీలు చేస్తున్నారు. 20 మందికిపైగా బృందంగా వచ్చిన అధికారులు తనిఖీలు చేపట్టారు. 2023లో అప్పటి కౌన్సిల్‌లో జరిగిన పనుల అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. భవనాల అనుమతులు, రాబడి, ఖర్చుల వివరాలు, ఆటోల డిజిల్ బిల్లులు, పారిశుద్ధ్యం, పలు అభివృద్ధి పనుల్లో అవినీతి ఆరోపణలపై పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.