|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 05:47 PM
కాళేశ్వరం కమిషన్ నివేదికపై BRS చీఫ్ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదని.. కాంగ్రెస్ కమిషన్ అని కొట్టిపారేశారు. 'కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించిందే. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. కొంతమంది BRS నేతలను అరెస్ట్ చేయొచ్చు.. భయపడొద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని. కాళేశ్వరంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో ప్రజలకు వివరించాలి' అని దిశా నిర్దేశం చేశారు.