|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 05:57 PM
TG: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భాగ్యనగరంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్న నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని GHMC, హైడ్రా అధికారులు సూచనలు చేశారు. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇళ్లకు చేరుకునే వారు తమ సూచనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.