|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 03:17 PM
ఆర్టీసీ డిపోకు చెందిన హైదరాబాద్-దేవరకొండ రూట్లో నడుస్తున్న బస్సులో కోదండపురం గ్రామానికి చెందిన అనిల్ ఇంజాపూర్ నుంచి కొండమల్లేపల్లికి ప్రయాణిస్తూ రూ. 50 వేల విలువైన తన ల్యాప్టాప్ ను మర్చిపోయి బస్సులో వదిలి వెళ్లాడు. డ్రైవర్ ఫయాజుద్దీన్, కండక్టర్ అలివేలుమంగ గమనించి ల్యాప్ టాప్ ను డిపో అధికారులకు అందజేయగా సోమవారం అసిస్టెంట్ మేనేజర్ సైదులు విచారణ చేసి బాధితునికి ల్యాప్ టాప్ అందజేశారు.