|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 03:18 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంపు హౌజ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు అందోళనకు దిగాయి. పంపులు ఆన్ చేయడానికి పంపు హౌజ్‌లోకి దూసుకెళ్లిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాళేశ్వరం ఈఎన్సీతో ఫోన్లో మాట్లాడారు. వారం రోజుల్లో పంపులు ఆన్ చేయకుంటే.. లక్ష మందితో వచ్చి పంపు హౌజ్‌లు ముట్టడిస్తామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు.