|
|
by Suryaa Desk | Sun, Aug 03, 2025, 08:59 AM
TG: బాలుడిని తీసుకుని పారిపోయిన ఓ మహిళపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలో జరిగింది. ఓ మహిళ తన భర్తతో విడాకులు తీసుకుని ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన బాలుడి(17)తో ప్రేమాయణం కొనసాగించి.. అతడిని తీసుకుని వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మహిళపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.