![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 03:00 PM
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరిగిందని, గతం కంటే ఈసారి భక్తులు ఎక్కువగా వచ్చారని మంత్రి పొన్నం తెలిపారు. అమ్మవారికి జరగాల్సిన అన్ని పూజలు ప్రభుత్వం తరపున చేస్తామన్నారు. అమ్మవారు కోరినట్లు ఖచ్చితంగా బలి విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. అగ్నిప్రమాదల నివారణకు తప్పనిసరి చర్యలు చేపడతామన్నారు. భవిష్యవాణిలో అమ్మవారు చెప్పిన అంశాలపై మంత్రి వర్గంలో చర్చిస్తామని స్పష్టం చేశారు.