![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 08:23 PM
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ శివారులోని విఠల్ నగర్‌లో కొంతమంది యువకులు గంజాయి మత్తులో హల్‌చల్ చేశారు. చేతిలో కత్తులు పెట్టుకుని హంగామా చేశారు. ఇది గమనించిన స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. ఈ ఘటన సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫుటేజ్ ఆధారంగా కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది కోసం గాలిస్తున్నారు.