|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 11:59 AM
బాసరలోని గోదావరిలో స్నానానికి దిగి హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గోదావరిలో బోటింగ్ నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 'ఆదివారం బాసరలో జరిగిన ఘటన దృష్ట్యా బోటింగ్ నిలిపేస్తున్నాం. వర్షాకాలం పర్యాటక పడవలపై నిషేధం అమల్లో ఉంటుంది' అని భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి తెలిపారు.