|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 12:10 PM
సంగారెడ్డి జిల్లా ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు విచారణకు హాజరవుతున్న కేటీఆర్ కి మద్దతుగా నారాయణఖేడ్ నుంచి బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ తరలి వెళ్లారు. మాజీ జడ్పీటీసీ రాథోడ్ లక్ష్మీబాయి, రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. కేటీఆర్ పై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. కాళేశ్వరంలో అవకతవకల ప్రచారంపై ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మళ్లీ ఫార్ములా ఈ రేసుపై తిరిగి విచారణ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.