|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 12:14 PM
ప్రేమ పేరుతో జూనియర్ ఆర్టిస్టును మోసం చేసిన జిమ్ ట్రైనర్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.15 లక్షలు తీసుకొని, యువతిని మోసం చేసిన జిమ్ ట్రైనర్ . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక యువతి 2019 లో హైదరాబాద్ కు వచ్చి, సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తుండగా, 2020 లో గాయత్రి హిల్స్ లో ఉంటున్న జిమ్ ట్రైనర్ పరిచయమయ్యాడు . వీరి పరిచయం ప్రేమగా మారి సహజీవనం ప్రారంభించగా, కొన్నాళ్ళకు యువతిని దూరం పెట్టడం ప్రారంభించిన జిమ్ ట్రైనర్ . దీంతో అతనికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని గ్రహించి, ఆంధ్రప్రదేశ్ లోని తన సొంత గ్రామానికి వెళ్లిపోయిన యువతి. 2023 నవంబర్ లో తిరిగి హైదరాబాద్ కు వచ్చిన యువతికి, పెళ్ళిచేసుకుంటాని చెప్పి మరోసారి దగ్గరయ్యే ప్రయత్నం చేసిన జిమ్ ట్రైనర్. పెళ్లికి రూ.15 లక్షలు అవసరం అవుతాయని చెప్పడంతో, అతను అడిగిన డబ్బంతా చెల్లించిన యువతి . డబ్బులు తీసుకున్న కొన్ని రోజులకు యువతిని మళ్లీ దూరం పెట్టడం ప్రారంభించిన జిమ్ ట్రైనర్ . దీంతో అతని గురించి ఎంక్వైరీ చేయగా, అతనికి ఇంతకముందే వివాహం జరిగిందని తెలుసుకొని, మోసపోయానని గ్రహించిన యువతి . తీసుకున్న డబ్బులు ఇవ్వమంటే తప్పించుకొని తిరుగుతుండడంతో, జిమ్ ట్రైనర్ పట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి . బాధితురాలు ఫిర్యాదు మేరకు జిమ్ ట్రైనర్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు