|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 12:18 PM
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదు విభాగంలో తమ సమస్యలను చెప్పుకోవడానికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం బైంసా పట్టణం సంతోష్ నగర్ కు చెందిన బాధితులు కలెక్టరేట్ వెళ్తున్న క్రమంలో చిట్యాల బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వాహనం వెనుక నుండి ఢీకొనడంతో ఆటో బోల్తా పడి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది