|
|
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 02:55 PM
జోగులాంబ గద్వాల నియోజకవర్గంలో మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత ఆధ్వర్యంలో 13 మంది లబ్ధిదారులకు రూ. 3,88,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేయబడ్డాయి.
ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక నిరుపేదల ప్రాణాలు కాపాడబడుతున్నాయని, ఈ కార్యక్రమం ద్వారా నిరుపేదలకు ఆర్థిక సహాయం అందుతోందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాస్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.