|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 12:39 PM
కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే, మొత్తం తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టేనని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం, రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్‌గా నిలబెట్టడం తప్పా? అని ఆమె నిలదీశారు. కాళేశ్వరంపై మాట్లాడుతూ.. అది కమిషన్ ప్రాజెక్టు కాదు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ కమిషన్ అని ఆమె విమర్శించారు.హైదరాబాద్ లో ధర్నాను ఆపితే ప్రతి జిల్లాలోని గల్లీ గల్లీ తిరుగుతామని హెచ్చరించారు. కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, 15 రిజర్వాయుర్లు, 200 కిలో మీటర్ల, 1500 కిలో మీటర్ల పైచిలుకు కాలువలు ఉన్నాయని వివరించారు. కాళేశ్వరం ఎత్తిపోసిన మట్టితో 300 పిరమిడ్లు నిర్మించవచ్చన్నారు. కాళేశ్వరంలో ఉపయోగించిన స్టీలుతో వంద యాపిల్ టవర్లు నిర్మించవచ్చని కవిత తెలియజేశారు. ఈ ధర్నాలో ఎంఎల్‌సి కవిత, జాగృతి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.