|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 12:53 PM
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. బుధవారం ఓదెల మండలం గుండ్లపల్లిలో రూ. 8లక్షల నిధులతో సీసీ రోడ్లకు కోసం శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి నూతన ఇండ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు.