|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 01:23 PM
నల్గొండ జిల్లా మాల మహానాడు హాలియా మండల మాజీ అధ్యక్షుడు మద్దెల డేవిడ్ కుమారుని వివాహం రేపు (గురువారం) హల్వాల ఎక్స్ రోడ్‌లోని శుభం ఫంక్షన్ హాల్‌లో జరగనుంది. ఈ వివాహ వేడుకకు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య హాజరుకానున్నట్లు నల్గొండ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు లకుమల మధు బాబు బుధవారం తెలిపారు.
ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మాల మహానాడు నాయకులు, నాగార్జునసాగర్ నియోజకవర్గ నాయకులు వివాహ వేడుకకు హాజరు కావాలని మధు బాబు కోరారు.