![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 10:29 AM
TG: బైక్‌పై వెళ్తున్న బావ, బావమరిదిని కంటైనర్ ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. వివేక్ నగర్ తండాకు చెందిన బావ, బావమరిది శ్రీనివాస్, నవీన్ కేకు కొనేందుకు బైక్‌పై వచ్చారు. వారిని అతివేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొని, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.