|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 10:33 AM
సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట గ్రామంలో జాతీయ రహదారిపై కొలువైయున్న శ్రీ పద్మావతి అలువేలుమంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వారోత్సవ పూజలను శనివారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో కొలువైన ఉభయ దేవతలతో శ్రీవారికి అభిషేకాలు, అలంకరణ గావించి అష్టోత్తర శతనామ స్తోత్ర పూజలను జరిపారు. నైవేద్య నివేదన చేసిన అర్చకస్వాములు కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు.