|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 10:28 PM
‘మిరాయ్’ చిత్రానికి ఈ స్థాయి అద్భుతమైన విజయాన్ని అందించి, హృదయపూర్వకంగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నా పూర్ణ హృదయంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమ, మీ ఆదరణ వల్లే నేను ఈ journeyni కొనసాగిస్తున్నాను. మీరు లేకపోతే నేను ఇక్కడ ఉండలేను.సినిమా చూసిన ప్రేక్షకులు స్వయంగా రీల్స్ చేయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చూసి ఎంతో హర్షం కలిగింది. ఇది నిజంగా మా టీమ్ కు చాలా పెద్ద మెరుపు.ఈ ప్రాజెక్టులో మంచు మనోజ్ గారు భాగం కావడం, సినిమాకి కొత్త దశను తీసుకువెళ్లింది. ఎప్పుడూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే గోల్డెన్ హార్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి స్పెషల్ థాంక్స్. సినిమా ఆరంభంలోనే ఆయన కథనాన్ని నరేట్ చేయడం వల్ల మిరాయ్ కి మరింత వెయిటేజ్ వచ్చింది.ఈ సినిమాను ఈ స్థాయికి తీసుకురావడంలో దర్శకుడు కార్తీక్ గారి కృషి అపూర్వం. ఆయన లేకుండా ఈ సినిమా అసంభవమే. నిర్మాత విశ్వప్రసాద్ గారు మా వెనుక నిలబడి మాకు మద్దతుగా ఉండి, ఒక పిల్లర్‌లా మాకు బలాన్ని ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎంతో కృతజ్ఞతలు.మనోజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు – ఆయన ఈ ప్రాజెక్టులో చేరడంతో సినిమా ఓ స్పెషల్ ఫీలింగ్ తెచ్చుకుంది. అలాగే రితికా, ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలుగా ఎంత డెడికేషన్ తో వర్క్ చేసారో చూసాను. ఆమెకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు.హరి గౌరా గారి సంగీతానికి వచ్చిన స్పందన చాలా గొప్పది. ఆయన ఈ సినిమాకి ఎంతో ప్యాషన్ తో పని చేశారు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు తమ పని ద్వారా సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లారు.రానా గారు నా గత సినిమాకి, అలాగే ఈ సినిమాకి చూపించిన మద్దతు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మంచి కంటెంట్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలనే ఆయన ఆలోచన నిజంగా మనసుని తాకింది.మా విఎఫ్ఎక్స్ టీమ్ చేసిన పని గురించి ప్రేక్షకుల ప్రశంసలు వింటూ ఉండడం చాలా సంతృప్తిగా ఉంది. జగపతిబాబు గారు, శ్రీయ గారు, జయరాం గారు వంటి సీనియర్ నటులు మా ప్రాజెక్టులో భాగమవ్వడం మా అదృష్టం.ఈ విజయాన్ని సాధించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. 'మిరాయ్' ఓ హార్ట్ టచింగ్ సినిమా. ఇంకా చూడని వాళ్లందరూ థియేటర్‌కి వచ్చి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి!
Latest News