|
|
by Suryaa Desk | Wed, Sep 10, 2025, 12:04 AM
తేజ సజ్జా హీరోగా వస్తోన్న సూపర్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'మిరాయ్' తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం 'మిరాయ్'. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై TG విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత TG విశ్వ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, "మిరాయ్" టికెట్ ధరలను పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు.అధిక మంది ప్రేక్షకులు సినిమా థియేటర్లలో చూడాలని భావించి ఇదే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.'ది రాజాసాబ్' అప్‌డేట్ ఇదే!మిరాయ్ ప్రెస్ మీట్ సందర్భంగా, ప్రభాస్ నటిస్తున్న 'ది రాజాసాబ్' సినిమాపై కీలక అప్డేట్‌ను నిర్మాత TG విశ్వ ప్రసాద్ వెల్లడించారు.ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు. అలాగే, రిషబ్ శెట్టి నటిస్తున్న కాంతారా-2 థియేటర్లలో 'ది రాజాసాబ్' ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అంటే ఈ లెక్కన అక్టోబర్ 2న ట్రైలర్ విడుదల కాబోతోంది.అంతేకాకుండా, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా (అక్టోబర్ 23) ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేయాలన్న ఆలోచన ఉందని చెప్పారు. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.ఇక ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Latest News