|
|
by Suryaa Desk | Sun, Sep 07, 2025, 08:07 PM
బాలీవుడ్ లో విభిన్నమైన విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మనోజ్ బాజ్ పాయ్ కనిపిస్తాడు. ఒక వైపున వెబ్ సిరీస్ లతో .. మరో వైపున ఓటీటీ సినిమాలతో ఆయన దూసుకుపోతున్నాడు. అలా ఆయన ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే 'ఇన్ స్పెక్టర్ ఝండే'. చిన్మయ్ డి మండ్లేకర్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్,నేరుగా ఓటీటీకి వచ్చేసింది. యథార్థసంఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీ నుంచి హిందీతో పాటు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.కథ: ఈ కథ 1970 - 86 మధ్య కాలంలో నడుస్తుంది. తీహార్ జైలు నుంచి కార్ల్ భోజ్ రాజ్ (జిమ్ కర్బ్) అనే ఖైదీ తప్పించుకుంటాడు. కరడుగట్టిన నలుగురు నేరస్థులతో పాటు అతను పారిపోయినట్టు వినగానే పోలీస్ ఆఫీసర్ మధుకర్ ఝండే ( మనోజ్ బాజ్ పాయ్) కంగారు పడిపోతాడు. ఎందుకంటే 1970 నుంచి అతను వివిధ దేశాలకు చెందిన జైళ్ల నుంచి ఐదు సార్లు తప్పించుకుంటాడు. ఇంటర్ పోల్ ఆఫీసర్స్ ను ముప్పతిప్పలు పెట్టిన ఖైదీ అతను. అలాంటి నేరస్థుడు మరోసారి తప్పించుకోవడం చర్చనీయాంశమవుతుంది. అలాంటి భోజ్ రాజ్ ను పట్టుకోవడం కోసం డీజీపీ 'పురంధర్' (సచిన్ ఖేడేకర్) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. గతంలో భోజ్ రాజ్ ను పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ మధుకర్ ఝండేకి ఆ బాధ్యతను అప్పగిస్తాడు. మధుకర్ ఝండే తన టీమ్ తో కలిసి రంగంలోకి దిగుతాడు. భోజ్ రాజ్ 'గోవా'కి పారిపోయినట్టుగా అతని ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. దాంతో అతను తన టీమ్ తో కలిసి అక్కడికి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? మధుకర్ ఝండే టీమ్ కి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది కథ.
Latest News