|
|
by Suryaa Desk | Sat, Sep 06, 2025, 02:25 PM
కన్నడ హిట్ చిత్రం 'సు ఫ్రామ్ సో' ని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది. ఈ సినిమా తెలుగులో మిశ్రమ సమీక్షలని అందుకుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం సెప్టెంబర్ 9న తెలుగు, కన్నడ మరియు మలయాళంలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. తన లైట్ బుద్ధ ఫిలిం బ్యానర్ కింద రాజ్ బి శెట్టి నిర్మించిన ఈ చిత్రంలో షానెల్ గౌతమ్, జె.పి. తుమినాడ్, సంధ్య అరాకేరే, ప్రకాష్ తుమినాడ్, దీపక్ రాయ్ పనాజే, మరియు మైమ్ రామ్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Latest News