|
|
by Suryaa Desk | Wed, Sep 03, 2025, 09:18 PM
ఇటీవలే పరదా మూవీలో మెప్పించిన అనుపమ పరమేశ్వరన్, మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమా కిష్కింధపురి. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.రిలీజ్ తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్లలో టీమ్ బిజీగా ఉంది. ఈ క్రమంలో కిష్కింధపురి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు అనుపమ కూడా హాజరై సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హారర్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని, చిన్నప్పటి నుంచే వాటిని చూసే వాడినని చెప్పారు. "నా జుట్టు చూసే ఇలాంటి సినిమాల్లో అవకాసాలు వచ్చాయి అనుకుంటా" అని నవ్వుతూ చెప్పింది.అనుపమ మాట్లాడుతూ – "నాకి హారర్ జోనర్ సినిమాలంటే ఇష్టం. మూడేళ్ల వయసు నుంచే హారర్ మూవీస్ చూస్తున్నాను. కౌశిక్ కథ చెప్పగానే బాగా నచ్చింది. ఆయన చెప్పిన ఫ్లో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కౌశిక్‌తో పనిచేయడం అద్భుతమైన అనుభవం. స్క్రిప్ట్‌పై ఆయనకున్న క్లారిటీ నాకు బాగా కనబడింది. డబ్బింగ్ స్టూడియోలో ఇంతలా టార్చర్ చేసిన తెలుగు డైరెక్టర్ ఇంకెవ్వరూ లేరనుకుంటా" అంటూ నవ్వుతూ షేర్ చేశారు.ఈ సినిమాకు కౌశిక్ పెగళ్ల దర్శకత్వం వహించారు. కిష్కింధపురి సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది.
Latest News