|
|
by Suryaa Desk | Sun, Aug 24, 2025, 08:23 PM
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఎందరో నటీమణుల కల.
ప్రతి సినిమా కోసం భిన్నమైన కథలు ఎంచుకుంటూ, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది 'గేమ్ ఛేంజర్' చిత్రంతో ఫ్యాన్స్‌ను పలకరించారు. ఇప్పుడు 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ అనే చిత్రం షూటింగ్‌లో ఉంది. స్పోర్ట్స్ నేపథ్యంలో, విలేజ్ బేస్డ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
అయితే తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ తల్లిగా నటించాలన్న ఆఫర్‌ను ఓ యువ హీరోయిన్ తిరస్కరించిన విషయం ఇండస్ట్రీల చర్చనీయాంశమైంది."అవును, ఆ నటి శ్వాసిక.తమిళ, మలయాళ చిత్రాల్లో తనదైన నటనతో గుర్తింపు పొందిన శ్వాసిక, ‘వైగై’ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టారు". తరువాత పలు మలయాళ చిత్రాల్లో నటించి మినిమమ్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. టాలీవుడ్‌లో 'ఎటు చూసినా నువ్వే' సినిమాతో ప్రవేశించారు. ఈ ఏడాది ఆమె నటించిన ‘రెట్రో’, ‘మామన్’, ‘తమ్ముడు’ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ప్రస్తుతం ‘భోగీ’, ‘కరుప్పు’ అనే సినిమాల్లో నటిస్తున్నారు.కేవలం సినిమాలకే కాకుండా బుల్లితెరపై కూడా శ్వాసిక తన ప్రతిభను చూపించారు. పలు టీవీ షోలు, సీరియల్స్‌తో పాటు హోస్ట్‌గా కూడా కనిపించారు.
*తల్లి పాత్రకు గుర్తింపు తెచ్చింది.. కానీ పరిమితి వద్దన్నది ఆమె నిర్ణయం :తన వయసు కంటే పెద్దవారికి తల్లిగా నటించడంలో ఎలాంటి సంకోచం లేదని గతంలోనే ప్రూవ్ చేసిన శ్వాసిక, ‘లబ్బర్ పండు’ సినిమాలో అలాంటి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.అయితే ఆమె అద్భుతంగా నటించినప్పటికీ, ఆ సినిమా తర్వాత తరచూ తల్లి పాత్రలే వస్తున్నాయని, అందులో భాగంగా రామ్ చరణ్ తల్లిగా నటించమన్న పెద్ద ఆఫర్ వచ్చినప్పటికీ తాను తిరస్కరించానని పేర్కొన్నారు.“ఆ ఆఫర్ విని నిజంగా షాక్ అయ్యా” అని ఆమె వెల్లడించారు."పెద్ది అనే భారీ తెలుగు చిత్రానికి నన్ను సంప్రదించారు. అది పెద్ద బడ్జెట్ సినిమా. అయితే రామ్ చరణ్ తల్లిగా నటించాలన్న ఆ ఆఫర్‌ని నేను తక్షణమే తిరస్కరించా. ఇప్పుడే అలాంటి పాత్రలు చేయాల్సిన అవసరం నాకు లేదు" అంటూ శ్వాసిక స్పష్టం చేశారు.మార్చి 27న రిలీజ్ అవుతున్న 'పెద్ది'వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సతీష్ కిలారు ఈ చిత్రాన్ని దాదాపు ₹300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.కన్నడ స్టార్ డా. శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు వంటి స్టార్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీకి ఆర్. రత్నవేలు, ఎడిటింగ్‌కి నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రం 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.