|
|
by Suryaa Desk | Thu, Aug 21, 2025, 06:21 AM
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’ నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటనను ఆగస్టు 21ఉదయం సరిగ్గా 9:09 గంటలకు విడుదల చేయనున్నట్లు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వెల్లడించడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది.ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా ప్రకటనతో వారి నిరీక్షణకు రేపటితో తెరపడనుంది.రేపు రాబోయే అప్‌డేట్‌లో సినిమాకు సంబంధించిన టీజర్, కొత్త పోస్టర్ లేదా మరేదైనా కీలక సమాచారాన్ని విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అసలు ఆ అప్‌డేట్ ఏమై ఉంటుందోనని మెగా అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు.
Latest News