|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 04:11 PM
మల్టీ టాలెంటెడ్‌గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ 'కాంచన-4'.ఆయన సొంతం దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 'ముని' ఫ్రాంచైజీలో రాబోతున్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీ చిత్రాన్ని గోల్డ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఇక ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీలో నోరా ఫతేహి, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటిస్తున్న నెట్టింట వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ చిత్రం బృందం మాత్రం దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహి ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.'రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న కాంచన-4 చిత్రంతో నేను తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ సినిమాలోని వచ్చే హారర్ అండ్ కామెడీ సీన్స్‌తో నా నటనను, అలాగే డ్యాన్స్ స్కిల్స్‌ను ప్రదర్శించడానికి ఇది నాకు సరైన ప్రాజెక్ట్ అని నా అభిప్రాయం. ఈ చిత్రంలో పూజా హెగ్డే, లారెన్స్‌తో నటించడం చాలా సంతోషంగా ఉంది' అని తెలిపింది.
Latest News