|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 09:05 PM
గ్లామర్ బ్యూటీ రష్మికా మాండన్న తన కెరీర్‌లో బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫారంలో ఉంది. ఆమె రాబోయే హిందీ చిత్రం 'థామా' ఇప్పుడు ముఖ్యాంశాలు చేస్తోంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి వరల్డ్ అఫ్ తామా వీడియోని ఆగష్టు 19న ఉదయం 11 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖుర్రానా కూడా కీలక పాత్రలో నటించారు. ఈ ప్రాజెక్టును మాడాక్ ఫిల్మ్స్ మరియు జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరేష్ రావల్ మరియు నవాజుద్దీన్ సిద్దికి రష్మికా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ దీపావళి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది.
Latest News