|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 04:54 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క 'కూలీ' సందేహం లేకుండా ఈ సంవత్సరం అత్యంత ఎదురుచూస్తున్న కోలీవుడ్ సినిమాలలో ఒకటి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఆగస్టు 14న పెద్ద తెరలను తాకనుంది. ఈ సినిమా సాంగ్స్ కి భారీ స్పందన లభిస్తుంది. ఈ సినిమాని తెలుగురాష్ట్రాలలో ఆసియన్ డిస్ట్రిబ్యూషన్స్ విడుదల చేస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 400K టికెట్స్ అమ్ముడయినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్, నాగార్జునా, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్ మరియు ఇతరులు ప్రముఖ పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ ట్యూన్లను కంపోజ్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ యాక్షన్ డ్రామాని నిర్మిస్తుంది.
Latest News