|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 05:17 PM
బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా 'సైయారా' ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద తన అద్భుతమైన ప్రయాణంలో భారీ ఘనతను సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు డిజిటల్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. అహానా పండే మరియు అనీత్ పాడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని యాష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు.
Latest News