|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 03:46 PM
సిద్ధార్థ్ మల్హోత్రా- జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న బాలీవుడ్ తాజా చిత్రం 'పరం సుందరి'. ఈ సినిమాను తుషార్ జలోటా దర్శకత్వం వహించగా, దినేష్ విజన్ నిర్మించారు.ఈ మూవీ ఈ నెల (ఆగస్టు)29 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఈ క్రమంలో మేకర్స్ ఈ చిత్రం నుంచి వదిలిన పోస్టర్లు ఇప్పటికే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో జనాల్లో సినిమాపై భారీ హైప్ పెరిగింది. అయితే ఈ క్రమంలోనే మూవీ టీమ్ సినీ ప్రేక్షకుల్లో ఉత్సాహం నెలకొనేలా తాజాగా ట్రైలర్ విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ ఎగిరిగంతులేస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ అండ్ సిద్ధార్థ్ మల్హోత్ర మధ్య లవ్ స్టోరీ సినీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Latest News