|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 10:16 PM
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని టాలెంటెడ్ సుజీత్ దర్శకత్వంలో చేస్తునట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'OG' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగిల్ కి భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క నైజాం రైట్స్ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ 90 కోట్లకి సొంతం చేసుకున్నట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ జాపనీస్ నటుడు కాజుకి కీటమురా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, షామ్ మరియు హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News