|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 08:20 AM
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వస్తున్న వార్ - 2 చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ గొప్ప నటులని కొనియాడారు.ఈ ఇద్దరు అగ్ర నటులకు దర్శకత్వం వహించడం సాధారణ విషయం కాదని, అందుకే తాము ఎంతో శ్రమించామని ముఖర్జీ అన్నారు. ఈ చిత్రంలో ఎవరూ చెడ్డవారు కాదు, ఎందుకంటే ఇందులో ఇద్దరూ హీరోలేనని ఆయన స్పష్టం చేశారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఎంత గొప్పగా నటించారో సినిమాలో చూడొచ్చని తెలిపారు.వారిద్దరితో సినిమా తీయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ముఖర్జీ పేర్కొన్నారు. ఈ చిత్రంలో అనేక మలుపులు ఉన్నాయని, వాటిని థియేటర్లలోనే చూపిస్తామని, ట్రైలర్‌లో చూపించలేదని అన్నారు. ఇది ఒక అద్భుతమైన చిత్రమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సౌత్‌కు రావడం ఇదే మొదటిసారని, ఇది ఎన్టీఆర్ వల్లే జరిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అభిమానులందరూ థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి ఆనందించాలని ముఖర్జీ కోరారు.
Latest News