|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 05:57 PM
బాలీవుడ్ స్టార్ నటులు విక్కీ కౌశల్, అలియా భట్ మరియు రణబీర్ కపూర్ నటించిన సంజయ్ లీలా బన్సాలీ యొక్క అత్యంత అంచనాల డ్రామా లవ్ అండ్ వార్ విపరీతమైన సంచలనాన్ని సృష్టిస్తోంది. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ ప్రధాన విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే రణబీర్ కపూర్ కి జోడిగా నటిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాకి సంబందించిన పోస్టర్ కానీ లేదా టీజర్ ని రణబీర్ కపూర్ పుట్టినరోజున అంటే సెప్టెంబర్ 28న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో చిత్ర బృందం ఈ విషయం పై క్లారిటీ ఇవ్వనుంది. సంజయ్ లీలా భన్సాలీ దీనిని 2025 చివరి నాటికి పూర్తి చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్. యుద్ధం నేపథ్యంలో సాగే లవ్ అండ్ వార్‌లో నెగటివ్ షేడ్స్ లో రన్బీర్ కపూర్ పాత్ర ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది.
Latest News