|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 02:54 PM
టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే తన కొత్త ప్రాజెక్ట్ ని కౌశిక్ పెగళ్లపాటితో ప్రకటించారు. ఈ చిత్రానికి 'కిష్కీందపురి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ప్రోమోని ఉండిపోవే నాతోనే అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఫుల్ సాంగ్ ని ఈరోజు సాయంత్రం 4:05 గంటలకి హైదేరాబద్ లోని గీతాంజలి కాలేజీ అఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ లో గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించి సాంగ్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ప్రతిభావంతులైన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, డి శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. నిరంజన్ దేవరమానే ఈ చిత్రానికి ఎడిట్ చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News