|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 04:15 PM
ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఇటీవలే విడుదలైన కన్నడ హిట్ చిత్రం 'సు ఫ్రామ్ సో' ని తెలుగులో ఆగష్టు 8న విడుదల చేస్తుంది. రాజ్ బి శెట్టి ఒక కీలక పాత్ర పోషించిన మరియు సహ-నిర్మించిన ఈ చిత్రం పై తెలుగులో భారీ అంచనాలు ఉన్నాయి. జెపి తుమినాధ్ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్టైనర్ తెలుగు ట్రైలర్ భారీ స్పందను అందుకుంది. తాజాగా ఇపుడు మూవీ మేకర్స్ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ని ఆగష్టు 6న అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకి హైదేరాబద్ లోని హోటల్ దసపల్లా లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో షానెల్ గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, దర్శకుడు జెపి తుమినాధ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కలసా, మరియు రాజ్ బి శెట్టి నిర్మించిన ఈ సినిమాకి ఎస్ చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ మరియు సుమేద్ కె మరియు సందీప్ తులాసిదాస్ సంగీతం అందిస్తున్నారు.
Latest News