|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 06:33 PM
మోలీవుడ్ నటుడు మోహన్ లాల్ ఫుల్ ఫారంలో ఉన్నారు. ఇటీవలే విడుదలైన నటుడి చిత్రాలు ఎల్2 ఎంపురాన్ మరియు తుడారం బాక్స్ఆఫీస్ వద్ద హిట్స్ గా నిలిచాయి. తాజాగా ఇప్పుడు నటుడు తన తదుపరి సినిమని సత్యన్ ఆంథిక్కాడ్ దర్శకత్వంలో ప్రకటించారు. 'హ్రిదయాపూర్వం' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఈ చిత్రానికి లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేయగా భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్న మాళవిక మోహనన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. సంగిథ, సిద్దిక్, సంగీత ప్రతప్, నిషన్, లాలూ అలెక్స్, మరియు జానార్ధనన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అఖిల్ సత్యన్ స్క్రిప్ట్ రాశాడు, జస్టిన్ ప్రభాకరన్ సంగీత స్వరకర్తగా ఉన్నారు.
Latest News