|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 04:08 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు లోకేష్ కనగరాజ్ యొక్క 'కూలీ' ఆగస్టు 14 నుండి విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి రివ్యూస్ సానుకూలంగా ఉంటే ఈ చిత్రం తమిళ సినిమాలో ఆల్ టైమ్ రికార్డులను బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. సెన్సార్ ఫార్మాలిటీలు పూర్తయ్యాయి మరియు ఈ చిత్రానికి 'A' సర్టిఫికేట్ లభించింది. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని ప్రముఖ బ్యానర్ ప్రత్యంగిరా సినిమాస్ బ్యానర్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నార్త్ అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్స్ $1M వసూళ్లు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత పోస్టర్ ని విడుదల చేసింది. శ్రుతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. సౌబిన్ షాహిర్, నాగార్జున, సత్య రాజ్, మహేంద్రన్, రెబా మోనికా జాన్ మరియు కిషోర్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అమిర్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర నిర్మాణాన్ని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సంగీత స్కోర్‌ను ప్రఖ్యాత అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు.
Latest News