|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 08:16 AM
బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా 'సైయారా' ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద తన అద్భుతమైన ప్రయాణంలో భారీ ఘనతను సాధించింది. ఈ చిత్రం విడుదలైన 17వ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయల క్లబ్‌లోకి ప్రవేశించింది. తాజా బాలీవుడ్ వాణిజ్య రిపోర్ట్స్ ప్రకారం, సైయారా విడుదలైన మూడవ ఆదివారం భారతదేశం బాక్స్ఆఫీస్ వద్ద 9 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం యొక్క 17 రోజుల మొత్తం కలెక్షన్స్ 300.25 కోట్ల నెట్ కి చేరుకుంది. పికె, దంగల్, సుల్తాన్, టైగర్ జిందా హై, సంజు, యానిమల్, పటాన్, జవన్, గదర్ 2, స్ట్రీ 2, మరియు చవా వంటి బాలీవుడ్ బిగ్గీల జాబితాలో సాయిరా చేరింది. అహానా పండే మరియు అనీత్ పాడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని యాష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు.
Latest News