|
|
by Suryaa Desk | Sun, Aug 03, 2025, 09:34 PM
స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరూ తమ చిన్ననాటి స్నేహాలను గుర్తు చేసుకుంటుంటే, ప్రముఖ నటి తమన్నా మాత్రం ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. స్కూల్, కాలేజీ రోజుల్లో దొరికే స్నేహితుల కన్నా పెద్దయ్యాక ఏర్పడే స్నేహాలే ఉత్తమమైనవని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఫ్రెండ్‌షిప్ డే నాడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసిన తమన్నా, పెద్దయ్యాక ఏర్పడే స్నేహబంధాల గొప్పదనాన్ని వివరించారు. "నా దృష్టిలో పెద్దయ్యాక ఏర్పడే స్నేహాలే అత్యుత్తమమైనవి. నేను మాట్లాడే ప్రతి ఫ్రెండ్ తో ఫోన్ కాల్ 'ఐ లవ్ యూ'తోనే ముగుస్తుంది. ఎదుటివారు ఎలా ఉన్నారో, ఎలా భావిస్తున్నారో తెలుసుకోవడానికే ప్రతి కాల్ ఉంటుంది. స్కూల్, కాలేజీల్లోనే గొప్ప స్నేహితులు దొరుకుతారనేది ఒక అపోహ మాత్రమే. కానీ నా అభిప్రాయం ప్రకారం, వయసు పెరిగాక దొరికే స్నేహితులే బెస్ట్" అని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు.
Latest News