|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 07:23 PM
టాలీవుడ్ నటుడు మహేష్ బాబు సూపర్ స్టార్ గా అవతరించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 'అతడు' విడుదలైన 20 సంవత్సరాల తరువాత మళ్ళి తెలుగు వెండితెరపైకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్‌గా ఆగష్టు 9న రెండు తెలుగురాష్ట్రాలలో విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క రీ రిలీజ్ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఐమాక్స్ ఫార్మాట్‌లో తిరిగి విడుదల చేసిన మొదటి భారతీయ సినిమాగా ఈ చిత్రం భారతీయ సినిమాలో కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రంలో సాంకేతికంగా 4K అల్ట్రా హెచ్‌డి రిజల్యూషన్ మరియు డాల్బీ ఆడియో మాస్టరింగ్ ఉంటాయి. ఈ చిత్రం 2005 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రంలో త్రిష, నాజర్, బ్రహ్మానందం, సుధా, హేమ, బ్రహ్మాజీ, సోను సూద్, ప్రకాష్ రాజ్ మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ ఆధ్వర్యంలో మురలి మోహన్ ఈ సినిమాని బ్యాంక్రోల్ చేశారు.
Latest News