|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 09:06 PM
71వ జాతీయ చలన చిత్ర అవార్డులు – తెలుగు విజేతల జాబితా బయటకు! న్యూఢిల్లీ నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన సమావేశంలో జ్యూరీ సభ్యులు ఈ విజేతల వివరాలను వెల్లడించారు.
తాజాగా ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి మొత్తం ఏడు అవార్డులు దక్కాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ మూవీ భగవంత్ కేసరి ఎంపికైంది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చి హనుమాన్ రెండు అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీతో పాటు ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డ్ సాధించింది.2023 సినిమాలకు గానూ ఈ పురస్కారాలను జ్యూరీ సభ్యులు ప్రకటిస్తున్నారు. ‘హను-మాన్’ సినిమాను రెండు అవార్డులు వరించించాయి. ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ), బెస్ట్ ఫిల్మ్ (యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్) అవార్డులు దక్కాయి. ఉత్తమ గేయ రచయితగా 'బలగం' సినిమాలో 'ఊరు పల్లెటూరు' పాటకు కాసర్ల శ్యామ్ అవార్డును సొంతం చేసుకున్నారు. బెస్ట్ స్క్రీన్ప్లే (ఒరిజినల్) అవార్డును బేబీ సినిమాకు గాను సాయి రాజేశ్ నీలం ఎంపికయ్యారు.
*తెలుగు సినిమాలకు లభించిన నేషనల్ ఫిల్మ్ అవార్డులు (2025)
1. హను-మాన్ (HanuMan)ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డు – వసంత కుమార్
ఉత్తమ AVGC (Animation, VFX, Gaming, Comic) విభాగం అవార్డు
⇒ ఈ అవార్డు తెలుగు చలనచిత్రాలకు తొలిసారిగా వచ్చిన అరుదైన గౌరవం
⇒ హను-మాన్ లో విజువల్ ఎఫెక్ట్స్ వినూత్నంగా ఉండటం వల్లే ఈ గుర్తింపు
2. బలగం (Balagam)
ఉత్తమ గీత రచయిత (Lyricist) – కాసర్ల శ్యామ్ (‘ఊరూ పల్లెతూరు’ పాటకు)
⇒ ఈ పాట సామాజిక స్పృహతోపాటు, గ్రామీణ జీవనానికి అద్దంపట్టింది
3. బేబీ (Baby)
ఉత్తమ స్క్రీన్ప్లే రచన (Best Screenplay) – సాయి రాజేశ్
ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్ – PVNS రోహిత్ (పాట: ‘ప్రేమిస్తున్నా’)
4. భగవంత్ కేసరి (Bhagavanth Kesari)
ఉత్తమ తెలుగు ఫీచర్ ఫిల్మ్ (Best Feature Film in Telugu)
⇒ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ:“ఇది నాకు బోనస్ లాంటి గౌరవం. కమర్షియల్ సినిమాతో మంచి సందేశాన్ని ఇచ్చినందుకు గుర్తింపు లభించింది.”
5. గాంధీ తాత చెట్టు (Gandhi Tatha Chettu)
ఉత్తమ బాలనటికి (Best Child Artist) – సుకృతి వేని బండ్రెడ్డి
ఇతర ముఖ్యమైన అవార్డులు (తెలుగు వారికీ సంబంధించి):ఉత్తమ నటుడు (Best Actor) – షారుక్ ఖాన్, విక్రాంత్ మస్సీ (సహ అవార్డు) ఉత్తమ నటి (Best Actress) – రాణీ ముఖర్జీ