|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 03:44 PM
గత కొద్ది కాలంగా విజయ్ దేవరకొండ హిట్ కోసం తాపత్రయ పడుతున్నాడు. ఈ సారి ఎలాగైనా విజయాన్ని సాధించాలని కసితో రౌడీ హీరో పాన్ ఇండియా మూవీ 'కింగ్‌డమ్'(తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. దీంతో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రౌడీ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.''నేనింకా సినిమా చూడలేదు.. చూడనిస్తలేదు.. థియేటర్ కు వెళ్దామంటే పర్మిషన్ కావాలి. ఇది కావాలి అది కావాలని భయపెడుతున్నారు నన్ను. ఇది విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ కాదు. ఈ సినిమా విజయ్ దేవరకొండ కమ్ బ్యాక్ కాదు. ఇది 100% మన బ్లాక్ బస్టర్. మనం కొట్టినం. మీ అందరి ప్రేమ అభిమానం వల్లే ఇదంతా సాధ్యమైంది. మీ సపోర్ట్‌తో మరిన్ని మంచి సినిమాలు చేస్తాను. మనం కొట్టినం అని ఫోన్ చేసి నన్ను ఏడిపించేశారు'' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News