|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 08:37 AM
రామ్ గోమోలా దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన 'ఓ భామా అయ్యో రామా' చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇవటానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఆగష్టు 1న ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో సుహాస్ కి జోడిగా మాళవిక మనోజ్ నటిస్తుంది. అనితా హస్సానందని, ప్రభాస్ శ్రీను మరియు అలీ,రవీందర్ విజయ్, బబ్లూ పృథివీరాజ్, రఘు కారుమంచి, మోయిన్, సాథ్విక్ ఆనంద్ మరియు నాయని పావని ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. భావిన్ ఎమ్ షా ఎడిటింగ్‌ను నిర్వహించారు మరియు సినిమాటోగ్రఫీని ఎస్.మనికాండన్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని రాధాన్ ట్యూన్ చేసారు. ఈ చిత్రాన్ని హరీష్ నల్లాపై వి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు.
Latest News