|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 12:06 AM
సిద్ధార్థ్ నటించిన కుటుంబకథా చిత్రం '3BHK' 2025 ఆగస్టు 1వ తేదీ నుండి Amazon Prime Video లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఆడియో అందుబాటులో ఉంటుందని తెలిపారు. విదేశాల్లో ఈ సినిమా సింప్లీ సౌత్ అనే ప్లాట్‌ఫారమ్ ద్వారా స్ట్రీమింగ్ కానుంది. సొంత ఇంటి కల నెరవేర్చుకునే సమయంలో ఒక మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే సమస్యలను ఈ చిత్రం చూపిస్తుంది. ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో విడుదలైంది.కథ ప్రధానంగా వాసుదేవ్ (శరత్ కుమార్) మధ్యతరగతి కుటుంబం జీవితం గురించి. హైదరాబాద్‌లో ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్న అతడు, ఎప్పటికైనా సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కనుతున్నాడు. ఆ కలను సాకారం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తాడు, కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నాడు.తన కలను తన కొడుకు ప్రభు (సిద్ధార్థ్) ద్వారా నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు. అయితే ప్రభు తన కెరీర్‌లో సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. 34 ఏళ్ల వయస్సులో సరైన ఉద్యోగం లేక తండ్రిపై ఆధారపడుతూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభు తండ్రి కలను నెరవేర్చడానికి ఏం చేశాడో, అలాగే అతడు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటో కథలో ముల్యమైన అంశాలు.
Latest News