|
|
by Suryaa Desk | Thu, Jul 31, 2025, 03:49 PM
టాలీవుడ్ నటుడు నితిన్ గత కొన్ని సంవత్సరాలుగా బ్యాక్-టు-బ్యాక్ ఫ్లాప్‌ల ను అందుకుంటున్నాడు. భీష్మా తరువాత నటుడు హిట్ ఇవ్వడంలో విఫలమయ్యాడు. అతను రాబిన్హుడ్ మరియు తమ్ముడు పై భారీ ఆశలను పెట్టుకున్నాడు కాని రెండు సినిమాలు భారీ ఫ్లోప్స్ గా మారాయి. తరువాత నటుడి పైప్‌లైన్‌లో విక్రమ్ కె. కుమార్‌తో కలిసి ఒక చిత్రం ఉంది. విక్రమ్ కె. కుమార్ చిత్రం హై బడ్జెట్ స్పోర్ట్స్ డ్రామా అని ఇంతకు ముందు నివేదించబడింది. ఈ ప్రాజెక్టులో నితిన్ హార్స్ రైడర్‌గా కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ ఈ సినిమాకి 'స్వారీ' అనే టైటిల్‌ని లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News