|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 11:43 AM
లెలిజాల రవీందర్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘రాజు గాని సవాల్’. రితికా చక్రవర్తి కథానాయిక. రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మీ పిక్చర్స్ ద్వారా విడుదలకు సిద్ధమవుతోంది. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా లెలిజాల రవీందర్ మాట్లాడుతూ ‘నా జీవితంలో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కల్చరల్ ఈవెంట్స్ నేపథ్యంలో కథ సాగుతుంది. ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి సందేశం ఇచ్చే చిత్రమిది’ అని తెలిపారు. నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ ‘సినిమా టీజర్ చూశాం చాలా బావుంది. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది. రవీందర్ కొత్తతరహా కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అలరిస్తుంది’ అని అన్నారు.
Latest News