|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 07:48 AM
మ్యాడ్ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నటించిన '8 వసంతాలు' తో ప్రేక్షకులని అలరించింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిశ్రమ సమీక్షలని అందుకుంది. ఈ చిత్రంలో అనంతిక సనీల్ కుమార్, హను రెడ్డి మరియు రవి తేజా దుగ్గిరాలా ప్రధాన పాత్రలో నటించారు. ప్రఖ్యాత పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ కంటెంట్-ఆధారిత చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో నటి శుద్ధి అయోధ్య అనే మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలిగా నటించింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్ లో ట్రేండింగ్ 2వ పోసిషన్ లో ఉన్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా సాంకేతిక సిబ్బందిలో అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్‌గా, శశాంక్ మాలి ఎడిటర్‌గా మరియు బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. యాక్షన్ కొరియోగ్రఫీని వింగ్ చున్ అంజి నిర్వహిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ ఈ సినిమాని నిర్మించారు.
Latest News