|
|
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 05:00 PM
కోలీవుడ్ నటుడు ధనుష్ ఇటీవలే తన 54వ చిత్రాన్ని ప్రకటించారు. పోర్ థోజిల్ ఫేమ్ విగ్నేష్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాత్కాలికంగా D54 పేరుతో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క పూజా వేడుకకి సంబందించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రేమలు ఫేమ్ మామిత బైజు మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. జయరామ్, కెఎస్ రవికుమార్, సూరజ్ వెన్జరామూడు, కరునాస్, పృథ్వీ పండిరాజ్ కూడా ఈ సినిమాలో కీలకమైన తారాగణంలో భాగం. థింక్ స్టూడియోల సహకారంతో వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ కింద డాక్టర్ ఇషారీ కె. గణేష్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం స్వరపరిచారు.
Latest News